ETV Bharat / state

'మీరు వైద్య వృత్తిలో ఉన్నారు... ప్రాణాల మీద డబ్బులు సంపాదించకండి'

కరోనా విజృంభిస్తున్న తరుణంలో కొందరు మానవత్వం మరిచిపోతున్నారు. రెమ్​డిసివిర్​ ఇంజక్షన్​ల అవసరాన్ని అడ్డం పెట్టుకుని కరోనా రోగుల నుంచి లక్షల్లో గుంజుతున్నారు. అంతేకాకుండా.. రెమ్​డెసివిర్ ఇంజెక్షన్ స్థానంలో మరో ఇంజక్షన్​లు ఇచ్చి... అందినకాడికి దోచుకుంటున్నారు. కరోనా రోగి ఐసీయూలో ఉండటంతో కనీసం బంధువులు కూడా వెళ్లలేని పరిస్థితిని.. ఆసుపత్రి యాజమాన్యం అదనుగా మార్చుకుంటున్నాయి.

remdesivir
రెమ్​డెసివిర్ పేరిట మోసం
author img

By

Published : Apr 30, 2021, 12:52 PM IST

వైద్య వృత్తిలో ఉన్న మీరు దయచేసి ప్రాణాల మీద డబ్బులు సంపాందించకండి... నలుగురు ప్రాణాలు కాపాడండంటూ ఓ వివాహిత సెల్ఫీ వీడియోలో విజ్ఞప్తి చేసింది. తన భర్తకు కరోనా పాజిటివ్ వస్తే... రెమ్​డెసివిర్ ఇంజెక్షన్ ఇస్తామని ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రతినిధులు ఫోన్ చేసినట్లు ఆమె తెలిపింది. తీరా తన భర్తను ఆ ఆసుపత్రిలో చేరిస్తే... రెమ్​డెసివిర్ కాకుండా మరో ఇంజెక్షన్ ఇస్తున్నారనీ... వైద్యం సైతం చేయలేదన్నారు. రెమ్​డెసివిర్ ఇంజెక్షన్ కోసం జమ చేసిన నగదు ఇమ్మన్నా... దిక్కున్న చోట చెప్పుకోమన్నారని సెల్ఫీ వీడియోలో వాపోయింది.

రెమ్​డెసివిర్ పేరిట మోసం

విశాఖకు చెందిన ఓ వ్యక్తికి ఈనెల 13వ తేదీన కరోనా పాజిటివ్ వచ్చింది. తమ వైద్యుల సలహా మేరకు ప్రైవేట్ హాస్పిటల్​లో చేర్పించగా.. పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఇదే సమయంలో విశాఖలో అనిల్ నీరుకొండ ఆసుపత్రి సిబ్బంది.. రెమ్​డెసివిర్ ఇంజక్షన్​లు ఉన్నాయంటూ ఆరు ఇంజక్షన్ లు కలిపి 2.50 లక్షలు అని ఫోన్ చేసి బేరం కుదుర్చుకున్నారు. బాధితుడి భార్య వద్ద అంత డబ్బులు లేకపోయినా.. భర్త ప్రాణాలు కోసం అప్పు చేసి డబ్బులు జమ చేసింది. అంతే.. అక్కడ నుంచి ఆసుపత్రి సిబ్బంది.. మధు భర్తకు నరకం చూపించారు. రెమ్​డెసివిర్ ఇంజక్షన్​ స్థానంలో మరో రకం ఇంజక్షన్​లు ఇవ్వడం, కనీసం నర్సులు కూడా చెకప్ వెళ్లకపోవడంతో.. బాధితుడు శ్వాస సమస్య తలెత్తింది.

ఓ రోజు అర్థరాత్రి తనకు ఊపిరి ఆడటం లేదని, ప్రాణం పోయే పరిస్థితి ఉందని, తనకు ఇక్కడ నుంచి వెంటనే తీసుకెళ్లిపోవాలని బాధితుడు తన భార్యకు ఫోన్ చేసి చెప్పారు. ఆమె ఎట్టకేలకు తన భర్తను అనిల్ నీరుకొండ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి నగరంలో మరో ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం తను రెమ్​డెసివిర్ ఇంజక్షన్​ల కోసం కట్టిన 2.50 లక్షల కోసం ఆసుపత్రి సిబ్బంది అడుగగా, తమకు సంబంధం లేదని ఎవరికి చెప్పుకుంటావో.. చెప్పుకో అంటూ దురసుగా సమాధానం ఇచ్చారని బాధితుడి భార్య వాపోయింది.. అనిల్ నీరుకొండ ఆసుపత్రి డాక్టర్ శర్మ, సిబ్బంది నవీన్​లు సైతం తన ఫోన్ ఇప్పటికీ లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా తనకే కాదని, తనముందే మరో ఐదుగురు రెమ్​డెసివిర్ ఇంజక్షన్​ ల కోసం లక్షల్లో డబ్బులు చెల్లిస్తున్నారని ఆమె తెలిపారు. వైద్యులు నలుగురికి సాయం చేయాలి కానీ.. రోగుల ప్రాణాలపై డబ్బులు సంపాదించకూడదని సెల్ఫీ వీడియోలో వాపోయారు.

ఇదీ చదవండి: ఆర్టీసీ బస్సులో వంద రెమ్​డెసివిర్​ ఇంజెక్షన్లు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.