ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో గల లమతపుట్ వద్ద విద్యుదాఘాతానికి గురై ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ రత్నాకర్ రాంమోల్ మృతి చెందారు. ఆయన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందినవారు. గత మూడేళ్లుగా లమతపుట్లో ఉన్న ఆనంద్ నికేతన్ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం పాఠశాల వద్ద ఉన్న విద్యుత్ తీగ తగిలి తీవ్రగాయాల పాలయ్యారు.
పాఠశాల సిబ్బంది, స్థానికులు రాంమోల్ను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికే ప్రిన్సిపాల్ చనిపోయినట్లు తెలిపారు. లమతపుట్ ఎస్సై దిలీప్ ప్రధాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.