విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో లిఫ్ట్ పనిచేయడం లేదు. ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ విభాగానికి 2017 లో ఏర్పాటు చేసిన లిఫ్ట్ పాడయింది. ఫలితంగా.. గర్భిణులు, బాలింతలు మెట్లు ఎక్కలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ రోజుకు 10 నుంచి 15 వరకు సాధారణ, శస్త్ర చికిత్స లు.. ప్రసవాలు జరుగుతాయి.
రెండో అంతస్తులో బాలింతల చికిత్సకు వార్డు ఉంది. శస్త్రచికిత్స గది కూడా అదే అంతస్థులో ఉంది. అక్కడికి గర్భిణులు, బాలింతలను తీసుకెళ్లడానికి లిఫ్ట్ బాగా ఉపయోగపడేది. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం.. 3 నెలలుగా రోప్ వే పై చక్రాల కుర్చీతో గర్భిణులను పై అంతస్తుకి తీసుకెళ్తున్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని అంతా కోరుతున్నారు.
ఇవీ చదవండి: ఆపరేషన్ ముస్కాన్.. 101 పిల్లలు తల్లిదండ్రులకు అప్పగింత