ETV Bharat / state

ARREST: లైన్‌మెన్‌ బంగార్రాజు హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్ - నేర వార్తలు

లైన్‌మెన్‌ బంగార్రాజు హత్య కేసులో రాజకీయ కోణం లేదని.. ఆర్థిక లావాదేవీలే అసలు కారణమని పోలీసులు తేల్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ వెల్లడించారు.

ARREST
ARREST
author img

By

Published : Nov 7, 2021, 5:03 PM IST

విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఏనుగులపాలెంలో హత్యకు గురైన లైన్‌మెన్‌ బంగార్రాజు కేసులో ప్రధాన నిందితుడు కోరాడ గోవింద్ ను అరెస్ట్ చేసినట్లు డీసీపీ గౌతమిసాలి తెలిపారు. అదే ప్రాంతానికి చెందిన కోరాడ గోవింద్ కు, మృతుడు బంగార్రాజు కు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని.. ఆమె తెలిపారు. ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి తన బంధువుల వద్ద నుంచి మృతుడు బంగార్రాజు సుమారు రూ. 30 లక్షలు గోవింద్ కు ఇచ్చాడని తెలిపారు. ఈ హత్య వెనుక ఎటువంటి రాజకీయ కోణం లేదని.. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. ముందుగానే గోవింద్ పథకం ప్రకారం మృతుడు బంగార్రాజును పిలిపించి బిల్డింగ్ కు వచ్చే విద్యుత్ ను ఆపించి సీసీ కెమెరాలు పని చేయకుండా చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందనట్లు డీసీపీ తెలిపారు.

ఇదీ చదవండి:

animal lover: ఆమె.. మూగజీవాల పాలిట అమ్మ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.