విశాఖ జిల్లా రోలుగుంట మండలం పెద్దపేట జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆటోలో తరలిస్తున్న 160 కిలోల గంజాయిని పట్టుకున్నారు. చింతపల్లి మండలానికి చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని ఎస్ఐ ఉమా మహేశ్వరరావు తెలిపారు. ఆటోతోపాటు మరో ద్విచక్ర వాహనాన్ని, సెల్ఫోన్లు, 1500 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు.
ఇది చదవండి: