ETV Bharat / state

Police Restrictions to Public Due to CM Jagan Tour: సీఎం జగన్ పర్యటిస్తే చెట్లే కాదు.. దేవుడైనా పక్కకు జరగాల్సిందే..! - Restrictions to Public Due to CM Jagan Tour

Police Restrictions to Public Due to CM Jagan Tour: సీఎం జగన్ ఎక్కడ పర్యటించినా.. చెట్లను కొట్టేయడం జరుగుతూ వస్తోంది. అంతే కాకుండా ఎక్కడికి వెళ్లినా కాలు కిందకు పెట్టకుండా హెలికాప్టర్​లోనే వెళ్తూ ఉంటారు. ఇక ఇప్పుడు జగన్ వస్తున్నారని చెట్లను నరికేయడమే కాకుండా.. దేవుడి మండపాన్ని సైతం తొలగించడంపై విమర్శలొస్తున్నాయి.

Police Restrictions to Public Due to CM Jagan Tour

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 15, 2023, 11:06 AM IST

Police Restrictions to Public Due to CM Jagan Tour: సీఎం జగన్ పర్యటించిన ప్రతిసారీ హెలికాప్టర్​లోనే వెళ్తూ ఉంటారు. కానీ ఆయన నిత్యం గాలిలో ప్రయాణించినా నేలపై మాత్రం విధ్వంసం సృష్టిస్తున్నారు. సీఎం వస్తున్నారని వందల కొద్దీ చెట్లను నరికేయడం ఇప్పటికే చాలా సార్లు చూశాం. అదే విధంగా ప్రజలు సైతం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.

తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్​లో ఈ నెల 16వ తేదీన పర్యటిస్తున్నారు. సీఎం వస్తున్నారని అధికారులు సెజ్‌లో రోడ్ల పక్కనున్న వృక్షాలు, మరికొన్నింటి కొమ్మలు కొట్టేస్తున్నారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

CM Jagan: మొత్తం కలిపి 30 కి.మీ లేదు.. హెలికాప్టర్​ ఎందుకు సీఎం సారు..!

పాతది ఉండగా.. మరొకటి ఎందుకు..?: అంతేకాకుండా అచ్యుతాపురం సెజ్‌లో సీఎం జగన్ ప్రారంభించనున్న లారస్‌ యూనిట్‌కు కేవలం 500 మీటర్ల దూరంలో ఓ హెలిప్యాడ్‌ ఉంది. కానీ అది కాదని ఇప్పుడు ప్రభుత్వ నిధులతో మరొకటి నిర్మిస్తున్నారు. హెలికాప్టర్‌లో వచ్చి.. ప్రారంభించనున్న యూనిట్‌కు ఎదురుగా నిర్మించిన హెలిప్యాడ్‌లో సీఎం దిగనున్నారు.

మరోవైపు విశాఖ విమానాశ్రయం నుంచి పరవాడ ఫార్మాసిటీకి కేవలం 30 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. అయినా సరే ముఖ్యమంత్రి హెలికాప్టర్​లోనే వస్తున్నారు. పరవాడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అచ్యుతాపురానికీ హెలికాప్టర్‌నే నమ్ముకున్నారు. కొత్త హెలిప్యాడ్‌ను మంత్రి అమర్‌నాథ్‌ శనివారం పరిశీలించారు.

సెజ్​లో సమీపంలోనే ఉన్న పాత హెలిప్యాడ్
సెజ్​లో సమీపంలోనే ఉన్న పాత హెలిప్యాడ్

కాలు నేలపై పెట్టకుండానే..: చిన్నపాటి దూరానికి కూడా ప్రజల మధ్య నుంచి వెళ్లకుండా హెలికాప్టర్​లోనే వెళ్తుండటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అసలు కాలు నేలపై పెట్టకుండా ఇలా గాల్లో వచ్చి వెళ్లిపోతే ప్రజల ఇబ్బందులు ఎలా తెలుస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఒకసారి కిందకు దిగి.. తమ కష్టాలను వినాలని, వైసీపీ పాలనలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో చెప్పుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

సెజ్​లో కొత్తగా నిర్మిస్తున్న హెలిప్యాడ్

CM Tour Restrictions: 11 గంటలకు సీఎం పర్యటన.. 7గంటలకే రోడ్లు బ్లాక్.. జనాలకు తప్పని ఇబ్బందులు

సీఎం జగన్‌ వస్తే.. దేవుడైనా జరగాల్సిందేనా..: ఇన్ని రోజులు సీఎం జగన్ పర్యటించిన ప్రతిసారీ చెట్లను నరకడం, ప్రజలను ఇబ్బందులు పెట్టడం వంటివే చూశాం. కానీ ఈ సారి ఏకంగా దేవుడిని సైతం జగన్ పర్యటన ఉందని ఇబ్బంది పెడుతున్నారు. అడ్డుగా ఉంటుందని దుర్గాదేవి అమ్మవారి మండపాన్ని తొలగించారు.

తొలగిస్తున్న మండపం
తొలగిస్తున్న మండపం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని వీవర్స్‌ కాలనీ మైదానంలో స్థానిక యువకులు 8 ఏళ్లుగా దుర్గాదేవి అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నారు. సంప్రదాయం ప్రకారం ఈ ఏడాదీ మైదానంలో మండపం ఏర్పాటు చేశారు. 19వ తేదీన సీఎం జగన్‌ ఎమ్మిగనూరు వస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. దీంతో మైదానంలో సభ ఉంటుందని మండపం తొలగించాలని యువకులను ఆదేశించారు. విధిలేని పరిస్థితుల్లో యువకులు మండపాన్ని తొలగించారు. మండప ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలమూ చూపకపోవడంతో యువకులు నిరుత్సాహానికి గురయ్యారు.

CM Tour Tress Cuts: బాబోయ్ సీఎం​ జగన్​ పర్యటన.. హడలెత్తిపోతున్న జనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.