విశాఖపట్నం జిల్లా, దేవరాపల్లి మండలం, తాటిపూడి గ్రామానికి చెందిన సోములు పైడిరాజు, కాదరి ఎరుకులు నుంచి 10 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరినుంచి రాబట్టిన సమాచారంతో సారా తయారీ స్థావరంపై దాడులు నిర్వహించారు. 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, కాల్చివేసినట్లు ఎస్సై సింహాచలం తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కి తరలించినట్లు పేర్కొన్నారు.
నాటుసారా స్థావరంపై దాడులు నిర్వహించిన పోలీసులు
విశాఖ జిల్లా, దేవరాపల్లి మండలంలోని తాటిపూడి వద్ద ఇద్దరు వ్యక్తుల నుంచి 10 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరికి సంబంధించిన సారా తయారీ స్థావరంపై దాడులు నిర్వహించి, బెల్లం ఊటను ధ్వంసం చేశారు. వీరిపై కేసు నమోదు చేసి, రిమాండుకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
నాటుసారా స్థావరంపై దాడులు నిర్వహించిన పోలీసులు
విశాఖపట్నం జిల్లా, దేవరాపల్లి మండలం, తాటిపూడి గ్రామానికి చెందిన సోములు పైడిరాజు, కాదరి ఎరుకులు నుంచి 10 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరినుంచి రాబట్టిన సమాచారంతో సారా తయారీ స్థావరంపై దాడులు నిర్వహించారు. 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, కాల్చివేసినట్లు ఎస్సై సింహాచలం తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కి తరలించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'రాష్ట్రంలో భయానక వాతావరణానికి ఈ ఫొటో ఉదాహరణ'