విశాఖ జిల్లా జి. మాడుగుల మండలం మద్దిగరువు ప్రాంతంలో పోలీసులు.. మావోయిస్టు దళ సభ్యులు, వారి సానుభూతిపరుల ఫోటోలను పోస్టర్ల రూపంలో అతికించారు. అందులో 25 మంది అనుమానితుల ఫోటోల వివరాలను జత చేశారు. జి. మాడుగుల మండలం మారుమూల మద్దిగరువు, బోయితలి, నుర్మతి ప్రాంతాల్లో వీటిని అతికించారు. పోస్టర్లలో ఉన్న వ్యక్తులు మావోయిస్టు పార్టీలో చేరి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వారి ఆచూకీ తెలిసినవారికి తగిన పారితోషికం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పోస్టర్లలో జిల్లా ఎస్పీ, నర్సీపట్నం ఓఎస్డీ, పాడేరు, చింతపల్లి డీఎస్పీల ఫోన్ నెంబర్లను పొందుపరిచారు.
ఇదీ చదవండీ.. పెరుగుతున్న కరోనా కేసులు..చర్యలు చేపట్టిన అధికారులు