అనకాపల్లిలో డ్రోన్లతో నిఘా... క్రికెట్ ఆడే వారిపై కేసు - laock down in vishakha patnam district
లాక్ డౌన్ లో భాగంగా నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకునేలా అనకాపల్లి పోలీసులు చర్యలు చేపట్టారు. డ్రోన్ కెమెరాలను వినియోగించి నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. సత్యనారాయణపురంలో క్రికెట్ ఆడుతున్న ఆరుగురు యువకులను గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. దర్జీ నగర్ లో రహదారిపై అనవసరంగా తిరుగుతున్న ఏడుగురు వ్యక్తులపైనా కేసు నమోదు చేశారు.
అనకాపల్లిలో డ్రోన్లతో నిఘా... క్రికెట్ ఆడే వారిపై కేసు