విశాఖ జిల్లా జి.మాడుగుల మండలంలో అత్యంత మారుమూల ప్రాంతమైన కె.బందవీధి గ్రామానికి చెందిన ఓ గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతోంది. సమాచారం అందుకున్న బైక్ అంబులెన్సు మార్గమధ్యంలో భారీ వర్షం కారణంగా ఆగిపోయింది. కంగారు పడిన స్థానికులు.. గ్రామ కార్యదర్శి, తహసీల్దార్, ఎస్సై ఉపేంద్రకు సమాచారం అందించారు. వెంటనే ప్రైవేటు జీపును గ్రామానికి పంపించి గర్భిణీ అయిన మత్యకొండమ్మను మద్దిగరువుకు తరలించి... అనంతరం బైక్ అంబులెన్స్ ద్వారా జి.మాడుగులకు తరలించారు.
అదే గ్రామానికి చెందిన మరో గర్భిణీ ఈశ్వరికి పురిటి నొప్పులు వస్తున్నాయన్న సమాచారంతో అదే జీపు మరోమారు గ్రామానికి వెళ్లి గర్భిణీని ఆసుపత్రికి తరలించారు. మత్యకొండమ్మ పాపకు జన్మనివ్వగా, ఈశ్వరి బాబుకు జన్మనిచ్చింది. ఈశ్వరి రక్తహీనతతో బాధ పడుతుండటంతో పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. సరైన సమయానికి స్పందించి ఆసుపత్రికి తరలించేందుకు సహకరించిన అధికారులు, పోలీసులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీచదవండి.