విశాఖ మన్యం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పుల ఘటనకు సంబంధించి మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ సహా పలువురు నేతలపై కొయ్యూరు మండలం మంప పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు కలిగి ఉండటం వంటి నేరారోపణలతో 20 సెక్షన్లతో కూడిన కేసులు పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. ఉపా, ఏపీపీఎస్ చట్టం వంటివీ ప్రయోగించినట్లు తెలుస్తోంది. అభియోగపత్రంలో మావోయిస్టు నేతలు గణేష్, అరుణ, జగన్, సుధీర్, ఉదయ్ ఇతర మిలీషియా సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.
నర్సీపట్నంలో మావోయిస్టు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. శుక్రవారం రాత్రే అశోక్, రణదేవ్, లలిత మృతదేహాలను బంధువులు తీసుకువెళ్లారు. మరో ముగ్గురి మృతదేహాలను తీసుకెళ్లడానికి శనివారం రాత్రి వరకు ఎవరూ రాలేదు. మరణోత్తర పరీక్షలు పూర్తయిన తర్వాత 72 గంటలపాటు మార్చురీలో మృతదేహాలను భద్రపరుస్తారు. ఈలోగా ఎవరూ రాకపోతే పోలీసులే ఖననం చేయిస్తారు.
ఇదీ చదవండి:
International Fathers day: తండ్రి అయ్యాకే తెలుస్తుంది.. నాన్న అంటే ఏమిటో..!