విశాఖ జిల్లా చోడవరంలో భారీ ఎత్తున గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకు విలువ రూ.కోటి ఉంటుందని అంచనా వేస్తున్నారు. తవుడు లోడుతో పాడేరు నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న వ్యాన్లో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో.. పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. తవుడు బస్తాల మధ్యలో గంజాయి మూటలు ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్ని అదుపులోకి తీసుకుని వాహనాన్ని స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి: