ETV Bharat / state

Ayyanna: అయ్యన్న ఇంటి వద్ద పశ్చిమ గోదావరి జిల్లా పోలీసుల మోహరింపు - tdp news

ayyanna house
ayyanna house
author img

By

Published : Feb 24, 2022, 6:09 AM IST

Updated : Feb 24, 2022, 8:18 AM IST

06:06 February 24

విశాఖ పోలీసుల సాయంతో అయ్యన్నను అదుపులోకి తీసుకునే అవకాశం

Notices to Ayyanna: విశాఖ జిల్లా నర్సీపట్నంలో తెలుగుదేశం నేత అయ్యన్నపాత్రుడు నివాసం సమీపంలో పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు భారీగా మోహరించారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో.. ఎన్టీఆర్​ విగ్రహ ఆవిష్కరణ సభలో.. సీఎంను అసభ్య పదజాలంతో దూషించారంటూ వైకాపా నేత రామకృష్ణ.. అయ్యన్నపాత్రుడిపై ఫిర్యాదు చేశారు. 153-A, 505(2), 506 I.P.C. సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే అయ్యన్న ఇంటికి నోటీసు అంటించారు. ఆయన ఇంటివద్దకు తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు.

విచారణకు రావాలని..

పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో ఈ నెల 18న ఎన్టీఆర్‌ విగ్రహాష్కరణ సభలో సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని స్థానిక వైకాపా నాయకుడు రామకృష్ణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం తాడేపల్లిగూడెం సీఐ ఎ.రఘు, దేవరపల్లి ఎస్సై కె.శ్రీహరిరావు, నల్లజర్ల ఎస్సై ఐ.అవినాష్‌ సెక్షన్‌ 41(ఎ) నోటీసుతో విశాఖ జిల్లా నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటికి వచ్చారు. ‘అయ్యన్న ఇంట్లో లేరు. పార్టీ సమావేశానికి వెళ్లారు. రాగానే సమాచారం ఇస్తాం’ అని పీఏ రామచంద్రరావు పోలీసులకు చెప్పారు. ‘ప్రముఖులు ఎక్కడికి వెళ్లినా పోలీసులకు సమాచారం ఉంటుంది. ఆయన నర్సీపట్నంలోనే ఉన్నట్లు మా వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. ఇంట్లోనే ఉంటారు. బయటకు రమ్మనండి. నోటీసు ఇచ్చి వెళ్లిపోతాం. 41(ఎ) నోటీసు సాధారణంగా కానిస్టేబుల్‌తో పంపిస్తాం. ప్రముఖ వ్యక్తి కావడంతో స్వయంగా ఇద్దామని వచ్చాం’ అని సీఐ పేర్కొన్నారు. అయ్యన్న లేరని పీఏ చెప్పడంతో ఫోన్‌ ద్వారా ధ్రువీకరించుకునేందుకు సీఐ, ఎస్సైలు ప్రయత్నించారు. ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి ఉండటంతో సీఐ ఉన్నతాధికారులతో మాట్లాడారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సచివాలయ వీఆర్‌ఓ నవీన్‌, మహిళా పోలీసు సమక్షంలో పంచనామా తయారు చేయించారు. అనంతరం నోటీసును ఇంటి గోడకు అతికించారు. ఓ కాపీని పీఏకు ఇచ్చారు. గురువారం ఉదయం 9 గంటలకు తాడేపల్లిగూడెం పోలీసు స్టేషన్‌లో హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. పోలీసులు రాత్రివరకు అయ్యన్న ఇంటి వద్దనే ఉన్నారు. అయ్యన్నను అరెస్టు చేసేందుకు పోలీసులొచ్చారని ప్రచారం కావడంతో నియోజకవర్గంలోని నాయకులు, ముఖ్య కార్యకర్తలు తరలివచ్చారు. వారు కూడా రాత్రి వరకు అక్కడే ఉన్నారు.

Last Updated : Feb 24, 2022, 8:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.