విశాఖ జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం - నర్సీపట్నం రహదారి గుంతలమయంగా మారింది. తరచూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. ఇటీవలే ద్విచక్ర వాహనదారులు ఈ ప్రాంతంలో పడిపోయారు. ఇద్దరికి కాళ్లు విరిగాయి.. ప్రమాదాలకు కేంద్రంగా మారుతున్న ఈ ప్రాంతాన్ని బాగుచేయాలని ఏఎస్ఐలు దొర, రాముడు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా పనులు చేయించారు. ప్రమాదాల నివారణకు పోలీసులు చూపిన చొరవకు, ఔదార్యానికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రమాదాలను నివారించేందుకు పోలీసుల చర్యలు - accidents in visakha
ఆ రహదారి అంతా గుంతల మయం. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి ప్రదేశంలో మరమ్మతులు చేయించేందుకు ఇద్దరు ఏఎస్సైలు స్పందించారు.
ప్రమాదాలను నివారించేందుకు పోలీసుల సాయం