విశాఖ జిల్లాలో అనకాపల్లి గనుల శాఖ కార్యాలయాన్ని ముట్టడించేందుకు మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు. పట్టణంలో ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ నిర్వహించడంతోపాటు తెదేపాకు చెందిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లాలోని ప్రభుత్వ ఇసుక డిపోలో గల్లంతైన సుమారు రెండున్నర కోట్ల రూపాయల విలువైన ఇసుక వ్యవహారంపై విచారణ చేపట్టాలని తెదేపా డిమాండ్ చేస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి గనుల శాఖ కార్యాలయాన్ని ముట్టడించేందుకు చర్యలు చేపట్టింది.
సుమారు 15 మంది తెదేపా నాయకులను నర్సీపట్నం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. వీరిలో మున్సిపాల్టీకి చెందిన కార్పొరేటర్లు, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు ఉన్నారు.
ఇదీ చదవండి: