విశాఖ మన్యంలో పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్టుల కదలికలపై అప్రమత్తమయ్యారు. ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో మందుపాతరలతో మావోయిస్టులు పోలీసులపై దాడులకు పాల్పడుతున్న పరిస్థితుల్లో.. రహదారులపై నిఘా మరింత పెంచారు. విశాఖ మన్యంలో అతి పెద్ద ఘాట్ రహదారి అయిన ఆంధ్ర-కశ్మీర్ లంబసింగిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
సివిల్, సీఆర్‌పీఎఫ్ పోలీసులు ఘాట్ రహదారిలో.. ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో తనిఖీలు నిర్వహించారు. ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలను గుర్తించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. గూడెం కొత్తవీధి మండలం ధారాలమ్మ ఘాట్ రహదారిని తనిఖీ చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే కాక సాధారణమైన ప్రదేశాల్లోనూ నిఘా నేత్రాలు ఏర్పాటు చేసి.. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూస్తున్నారు.
ఇవీ చూడండి: