ETV Bharat / state

Vande Bharat Express : నేడే వందేభారత్​ ఎక్స్​ప్రెస్​ ప్రారంభోత్సవం - సికింద్రాబాద్​లో వందేభారత్​ ట్రైన్​ ప్రారంభం

Vande Bharat Express launch today : తెలుగురాష్ట్రాల మధ్యసెమీ స్పీడ్‌ రైలు నేటి నుంచి అందుబాటులోకి రానుంది. సంక్రాతి పర్వదినాన సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య నడవనున్న వందే భారత్‌ను నేడు ప్రారంభం కానుంది. ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఆ రైల్‌ను ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ వర్చవల్‌ ద్వారా జెండా ఊపి రైలును ప్రారంభించనున్నారు. రేపటి నుంచి రెగ్యులర్‌ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. టికెట్‌ ధరలను రైల్వేశాఖ అధికారికంగా విడుదల చేసింది.

vande bharat
vande bharat
author img

By

Published : Jan 15, 2023, 6:36 AM IST

Vande Bharat Express launch today : తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు నేటి నుంచి పరుగులు పెట్టనుంది. ఉదయం 10 గంటలకు దిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా.. జెండా ఊపి ఈ రైలును ప్రారంభిస్తారు. సికింద్రాబాద్‌లోని 10వ నంబర్‌ ప్లాట్‌ ఫాం నుంచి వందేభారత్‌ రైలు ప్రారంభంకానుంది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను పర్యటించారు. అధికారులతో కలిసి రైల్వే స్టేషన్‌ను పరిశీలించి ఏర్పాట్లు సమీక్షించారు. ఆనంతరం కేంద్ర మంత్రులు వందేభారత్‌ రైలులోకి వెళ్లి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఆధునిక సాంకేతికతతో వందేభారత్‌ రైలు రూపకల్పన జరిగిందని... కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఉభయ రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి కానుకగా వందే భారత్ రైలును కేంద్రం ప్రారంభిస్తోందని తెలిపారు.

Vande Bharat Express in Secunderabad : వందేభారత్‌ రైలులో 16 బోగీలు ఉంటాయన్న అధికారులు అందులో 14 చైర్ కార్ బోగీలు, మరో రెండు ఎగ్జీక్యూటీవ్ చైర్‌కార్ బోగీలుంటాయన్నారు. మొత్తంగా రైలులో 1128 మంది ప్రయాణించవచ్చని తెలిపారు. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు ఈ రైలు సికింద్రాబాద్-విశాఖల మధ్య పరుగులు పెడుతుందని వివరించారు. మెట్రో రైల్‌ తరహాలో స్లైండింగ్‌ తలుపులు, ప్రయాణికుల భద్రత, సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పారు. సీసీటీవీ కెమెరాలు, రీడింగ్‌ లైట్లు, అత్యవసర పరిస్థితుల్లో రైల్‌ సిబ్బందితో మాట్లాడేందుకు ప్రత్యేకంగా అలారం బటన్‌ ఏర్పాటు చేశారు.

రైలులోని సీట్లు 180 డిగ్రీల కోణంలో తిరుగుతాయని అధికారులు వెల్లడించారు. విశాఖ నుంచి ప్రతిరోజూ ఉదయం 5.45కి వందే భారత్ రైలు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై రాత్రి పదకొండున్నరకి విశాఖపట్నానికి చేరుకుంటుంది.ఈ వందేభారత్ రైలు గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ..సికింద్రాబాద్-విజయవాడ 350కి.మీ దూరాన్ని 4గంటల్లో చేరుకుంటుందని.. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ఎనిమిదిన్నర గంటల్లో చేరుకుంటుందని వివరించింది.

వందేభారత్‌ టికెట్‌ ధరలను రైల్వేశాఖ అధికారికంగా ప్రకటించింది. చైర్‌కార్‌లో సికింద్రాబాద్‌ నుంచి వరంగల్‌కి 520.. ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌కి వెయ్యి 5 రూపాయలు వసూలు చేయనున్నారు. చైర్‌కార్‌లో సికింద్రాబాద్‌ నుంచి ఖమ్మం వరకు 750, సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు 905.. సికింద్రాబాద్‌ నుంచి రాజమండ్రికి 1365, సికింద్రాబాద్‌ నుంచి విశాపట్నానికి వెయ్యి 665 వసూలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

అదే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కి వెయ్యి 720 టికెట్‌ ధరగా నిర్ణయించినట్లు చెప్పారు. ఒకవేళ ఎవరైనా ఆహారం వద్దనుకుంటే ఆ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం నుంచి అందుబాటులోకి రానున్న వందే భారత్‌ కోసం సీట్ల రిజర్వేషన్‌ను అధికారులు శనివారం ప్రారంభించారు. సాయంత్రం వరకే మంగళ, బధవారం వరకే వెయిటింగ్‌ లిస్ట్‌ వచ్చిందని చెప్పారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.