విశాఖ జిల్లాలోని 25 వేల మంది పింఛనుదారులు, 50 వేలమంది ఉద్యోగులు జూన్ నెల వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు, పింఛన్లు బ్యాంకు ఖాతాలకు జమవుతాయి. ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం లభించి నాలుగు రోజులవుతున్నా సాంకేతిక కారణాల వల్ల విడుదల కాలేదు. బుధవారం సాయంత్రానికి జమవుతాయని ఖజానా శాఖ అధికారులు చెబుతున్నా.. ఆ పరిస్థితి లేదని, ఇంకా ఒకటి రెండు రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు.
ఇదీ చదవండి: గ్యాస్ లీకేజ్ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం: సీపీ ఆర్.కె మీనా