నాగపూర్ జైలులో ఉన్న ఆచార్య సాయిబాబాను, మహారాష్ట్ర నవీ ముంబైలోని జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న వరవరరావును వెంటనే విడుదల చేయాలని రాజకీయ ఖైదీల విడుదల కమిటీ కన్వీనర్ కే. పద్మ కోరారు. విశాఖ సీపీఐ కార్యాలయంలో పలుసంఘాల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఆచార్య సాయిబాబా, రచయిత వరవరరావు ఆరోగ్యం క్షీణిస్తోందని వారి సహచరుల ద్వారా తెలుస్తోందని ఆమె అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గొంతెత్తిన ప్రజాస్వామ్యవాదులు, మేధావులను జైలుపాలు చేసే పరిస్థితి దేశంలో నెలకొందని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఆచార్య సాయిబాబా, వరవరరావు తదితరులు వెంటనే విడుదల చేయాలని మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం కన్వీనర్ జేవీ. సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ వెంకటేశ్వర్లు, సీఎల్సి శ్రీరామ్ మూర్తి పాల్గొన్నారు.
ఇదీచూడండి: శానిటైజర్ తాగి ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం