విశాఖ పెందుర్తిలోని శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలు.. రేపు వైభవంగా నిర్వహించేందుకు పీఠం ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఆంధ్ర, తెలంగాణల్లో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో విద్వాంసులైన 200 మందికి పైగా వేదపండితులతో.. పెద్ద ఎత్తున వేదసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు ప్రముఖులు హాజరు కానుండగా.. పెందుర్తి సీఐ అశోక్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు.
ఇదీ చదవండి: 104 ఆలయాలకు ఛైర్‌పర్సన్‌గా సంచయిత!