ETV Bharat / state

Pawan Kalyan Fires on CM Jagan: జగన్​ను గెలిపించింది.. ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికి కాదు: పవన్​ కల్యాణ్​ - పవన్ కల్యాణ్ న్యూస్

Pawan Kalyan Fires on CM Jagan: జగన్‌ను సీఎంగా గెలిపించింది ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికి కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. దేవుడని గెలిపిస్తే.. జగన్​ దెయ్యంలా పట్టి పీడిస్తున్నాడని మండిపడ్డారు. విశాఖ వారాహి యాత్రలో పాల్గొన్న ఆయన.. వైసీపీ సర్కారుపై ఈ మేరకు నిప్పులు చెరిగారు.

Janasena_Pawan_Kalyan_Fires_on_Jagan
Janasena_Pawan_Kalyan_Fires_on_Jagan
author img

By

Published : Aug 14, 2023, 8:15 AM IST

Pawan Kalyan Fires on CM Jagan: జగన్​ను గెలిపించింది.. ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికి కాదు: పవన్​ కల్యాణ్​

Pawan Kalyan Fires on CM Jagan: రాష్ట్ర ప్రజలు జగన్‌ను సీఎంగా గెలిపించింది ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికా..? అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిలదీశారు. సర్కారు ఆస్తులను ఏపీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కింద 25 వేల కోట్ల రూపాయలకు తనఖా పెట్టేశారన్నారు. ఏ మూలకెళ్లినా ప్రభుత్వ భూములను కాజేస్తున్నారని ఆక్షేపించారు. గంగవరం పోర్టులో 10 శాతం అదానీకి రాసిచ్చారన్నారు. జగన్‌ను దేవుడని ప్రజలు గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చాక దెయ్యంలా పట్టి పీడిస్తున్నారంటూ పవన్‌ మండిపడ్డారు.

Pawan Kalyan Varahi Yatra at Visakha: రాష్ట్రంలో సంపదనంతా ముఖ్యమంత్రి జగన్‌ దోచేస్తున్నారని.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఆదివారం విశాఖ జిల్లా గాజువాకలో వారాహి విజయ యాత్రలో పవన్‌ పాల్గొనగా.. భారీగా జనం తరలివచ్చారు. దారి పొడవునా 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' నినాదమే తనకు వినిపించిందన్న పవన్‌.. వ్యక్తిగత స్వార్థం లేకుండా జగన్‌ ప్రజల కోసం ఏదైనా అడిగితే ప్రధాని ఎందుకు నెరవేర్చరన్నారు. కేసులున్న వ్యక్తులు, హంతకులకు దిల్లీ పెద్దలను అడిగే ధైర్యముండదన్నారు. రాష్ట్ర ఎంపీలంటే దోపిడీ దారులనే భావన దిల్లీలో ఉందని విమర్శించారు.

Police Notices to Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు విశాఖ పోలీసుల నోటీసులు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అభియోగం

Pawan Kalyan Sensational Comments on CM Jagan: విశాఖలో జగన్‌ పచ్చని కొండలను కొల్లగొడుతున్నారని పవన్‌ విమర్శించారు. దోపిడీని ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో యువత ఆలోచించి ఓటేయాలని పవన్‌ పిలుపునిచ్చారు. జగన్‌ పాలనలో రౌడీయిజం, గూండాగిరి తప్ప యువతకు ఉపాధి అవకాశాలు దక్కలేదన్నారు. 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామన్న సీఎం.. దీనిపై ప్రధానితో ఎందుకు మాట్లాడలేకపోయారని నిలదీశారు.

Pawan Varahi Vijaya Yatra: జనంలోకి జనసేనాని.. విశాఖలో ప్రారంభం కానున్న వారాహి యాత్ర మూడవ దశ

Pawan Kalyan Fires on YCP: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఒక రౌడీషీటర్‌ అని పవన్‌ విమర్శించారు. ఆయన చర్చ్​ల ఆస్తులు దోచుకుంటున్నారని మండిపడ్డారు. సిరిపురంలో ఎంపీ అక్రమంగా నిర్మిస్తున్న భవనాలను భవిష్యత్తులో ప్రభుత్వం మారగానే కూల్చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ.లక్ష కోట్ల ఆస్తుల పంపకాలు ఇంకా జరగలేదన్న పవన్‌.. జగన్‌కు చెందిన రూ.300 కోట్ల విలువైన ఆస్తుల కోసం.. రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులను వదిలేశారని విమర్శించారు.

Pawan visited CBCNC lands in Visakhapatnam విశాఖ సీబీసీఎన్‌సీ భూములను పరిశీలించిన పవన్.. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కోర్టుల చుట్టూ తిరగాలి!

Pawan Kalyan Speech in Visaka: 2019 ఎన్నికలప్పుడు గత ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తుందని జగన్‌ ఆరోపించారన్న పవన్‌.. అదే విషయంపై ఇప్పుడు కిక్కురుమనట్లేదన్నారు. రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు యజమాని ఎవరని ప్రశ్నించారు. విశాఖను గుండెల్లో పెట్టుకొని చూసుకునేందుకు జనసేన సిద్ధంగా ఉందన్న పవన్‌.. వచ్చే ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.