ETV Bharat / state

జీవీఎంసీ ఎన్నికల్లో తెదేపాదే విజయం: పట్టాభి - పట్టాభి తాజా వార్తలు

సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలపై తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కుపరిశ్రమను జగన్, విజయసాయిరెడ్డిలు అమ్మకానికి పెట్టారని పట్టాభి ఆరోపించారు. జీవీఎంసీ ఎన్నికల్లో తెదేపా విజయం ఖాయమన్నారు.

Pattabhi Criticize On Cm Jagan
తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి
author img

By

Published : Feb 28, 2021, 3:32 AM IST

రాష్ట్ర సంపదైన విశాఖ ఉక్కుపరిశ్రమను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైకాపా సీనియర్ నాయకులు విజయసాయిరెడ్డి అమ్మకానికి పెట్టారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి కె.పట్టాభి అన్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గండిగుండం పంచాయతీలో కౌంటింగ్ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై గ్రామస్ధులు చేపట్టిన రిలే నిరహార దీక్షాశిబిరాన్ని ఆయన సందర్శించారు.

స్టీల్ ఫ్లాంట్ అమ్మకానికి సంబంధించి అన్ని ఆధారాలతోసహా వీరి బండారం బయటపెట్టామన్నారు. దమ్ముంటే జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డిలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు నిజాలు తెలుసుకున్నారన్న పట్టాభి...జీవీఎంసీ ఎన్నికల్లో మంత్రి అవంతికి ఘోరపరాజయం తప్పదన్నారు. మంత్రి కుమార్తె ఓడిపోబోతోందని జోస్యం చెప్పారు. ఒకరిద్దరు నాయకులు ప్రలోభాలకు గురికావడం, అమ్ముడు పోవడం జరిగినంత మాత్రాన తెదేపాకు నష్టమేమీ లేదన్నారు. తెదేపాకు పటిష్టమైన క్యాడర్ ఉందన్న ఆయన...జీవీఎంసీ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామన్నారు.

ఇదీ చదవండి:

'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చీకటి ఒప్పందాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.