ETV Bharat / state

ఇక పాస్​పోర్టు పొందడం మరింత సులభం - తత్కాల్ పాస్​పోర్టు ఆప్లే

ఇకపై పాస్​పోర్టును తత్కాల్​లో తీసుకునేందుకు ఆధార్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఏవైనా మూడు డాక్యుమెంట్లు సమర్పిస్తే తత్కాల్​లో పాస్​పోర్టు పొందవచ్చు. రాష్ట్రంలో ఆన్​లైన్​తో అనుసంధానం కాని పోస్టాఫీసు పాస్​పోర్టు కేంద్రాలను నెల రోజుల్లో అనుసంధానం పూర్తిచేయనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే మన సమీప ప్రాంతాల్లోనే పాస్​పోర్టు పొందవచ్చు. ఈ మేరకు త్వరలోనే పార్వతీపురంలో పాస్​పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.

passport documentation in simple way
ఇక పాస్​పోర్టు పొందడం ఇంత వీజీ...!
author img

By

Published : Jan 15, 2020, 11:23 PM IST

విశాఖ పాస్​పోర్టు కార్యాలయ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి

మన దేశం నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య గతంతో పోలిస్తే ఏయేటికాయేడు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. విద్య కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య క్రమేపీ పెరుగుతుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తక్కువ సమయంలో ​తత్కాల్ పాస్​పోర్టు పొందేందుకు.. రాష్ట్ర వ్యాప్తంగా సేవాకేంద్రాలు విస్తరిస్తున్నారు. రాష్ట్రంలో ఏటా 5 లక్షల పాస్​పోర్టులు జారీ అవుతున్నాయి. ఈ ప్రక్రియను.. మరింత సులభతరం చేసింది మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. తత్కాల్ పాస్​పోర్టు పొందేందుకు సమర్పించాల్సిన పద్ధతిని సరళతరం చేసింది. పాస్​పోర్టు పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాల్సిన నిబంధనను తొలగించింది.

నెల రోజుల్లో అందుబాటులోకి..

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారి సౌలభ్యం కోసం నిర్దేశిత పోస్టాఫీసుల్లో పాస్​పోర్టు సేవా కేంద్రాలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ పోస్టాఫీసుల అనుసంధాన ప్రక్రియ మరో నెల రోజుల్లో పూర్తి కానుంది. పోస్టాఫీసుల్లోని పాస్​పోర్టు సేవాకేంద్రాల ద్వారా ఆన్​లైన్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని పోస్టాఫీసులో పాస్​పోర్టు సేవాకేంద్రం త్వరలోనే అందుబాటులోకి రానుంది.

మూడు రోజుల్లోనే...

సులభంగా, తక్కువ సమయంలో పాస్​పోర్టులు జారీ చేసేందుకు కొత్త విధానాలు అమల్లోకి తెస్తున్నామని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు. తత్కాల్ పాస్​పోర్టును మూడు రోజుల్లో అందజేస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:

'పాస్​పోర్టులను రద్దు చేసే అవకాశం లేదు'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.