శ్రీకాకుళం, టెక్కలి నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు పలువురు ప్రయాణికులు ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఎక్కగా.. వీరిని దారి మధ్యలో రెండు బస్సులలోకి మార్చారు. బస్సు విశాఖకు చేరుకోగానే గురుద్వార కూడలిలో దించేశారు. దీనితో ఆగ్రహం చెందిన ప్రయాణికులు ట్రావెల్స్ యాజమాన్యాన్ని నిలదీయడంతో ప్రమాదానికి గురైన వాహనాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులంతా డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు.
తాము హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఒక్కొక్కరు రూ. 2వేలు పెట్టి టిక్కెట్లు కొన్నామని..బస్సు డైరెక్ట్‌గా హైదరాబాద్‌కు వెళ్తుందని చెప్పి ఇప్పటికే రెండు బస్సులు మార్చారని, తీరా విశాఖకు చేరుకోగానే రోడ్డుపై దించేసి చాలా సేపటి తరువాత ప్రమాదానికి గురైన బస్సులో వెళ్లమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిక్కెట్ల కోసం వేలకు వేలు తీసుకుని ఇలా రోడ్డుపై వదిలేయడం ఏంటని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు కదలకుండా రోడ్డుపై అడ్డంగా నిలిచి.. యాజమాన్యం స్పందించాలని డిమాండ్ చేశారు.
ఇది చదవండి: