విశాఖ నగరంలో పోలింగ్ కేంద్రాల వద్ద యధేచ్చగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. కొంతమంది పార్టీ గుర్తులతో ఉన్న ఓటరు స్లిప్లను పంపిణీ చేస్తున్నారని.. దీనిపై అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవట్లేదని ఓటర్లు ఆరోపిస్తున్నారు. తాటిచెట్లపాలెంలోని కేంద్రీయ విద్యాలయంలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లే దారుల్లో తమ పార్టీ అభ్యర్ధికే ఓటెయ్యాలంటూ ప్రచారం చేస్తున్నారు. పోలీసుల నిఘా లేని సమయంలో ఈ రకంగా పార్టీ మద్దతుదార్లు వ్యవహరించడం ఓటర్లకు ఇబ్బందికరంగా మారుతోంది.
ఇదీ చదవండి: లయోలా కళాశాలలో పోలింగ్ని పరిశీలించిన.. ఎన్నికల కమిషనర్