స్వాతంత్య్రం సిద్ధించి 73 ఏళ్లు గడుస్తున్నా మౌలిక సదుపాయాలకు దూరంగా ఉన్నామని విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ సూర్లపాలెం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతమందిని గెలిపించినా తమ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రభుత్వాలు మారినా.. తమను పట్టించుకునే నాథుడే కరవయ్యారని చెప్పారు. రోడ్డు మార్గం లేక అత్యవసర సమయాల్లో ఆసుపత్రికీ వెళ్లలేకపోతున్నామని వాపోయారు. నిరసనగా పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి: విశాఖ పర్యటనలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు ప్రతినిధులు