ETV Bharat / state

పంచ గ్రామాల భూ సమస్య: సలహా కమిటీలోకి ఎంపీ విజయసాయి రెడ్డి

విశాఖ జిల్లాలోని సింహాచలం పంచ గ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. సమస్య పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన సలహా కమిటీని విస్తరించింది. ఇందులో ఇద్దరు వైకాపా ఎంపీలు, దేవదాయ శాఖ కమిషనర్​ను చేర్చింది.

pancha gramalu
pancha gramalu
author img

By

Published : Oct 29, 2020, 9:37 PM IST

విశాఖ జిల్లా సింహాచలం పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించేందుకు ప్రస్తుతం ఉన్న సలహా కమిటీని రాష్ట్ర ప్రభుత్వం విస్తరించింది. వైకాపా ఎంపీలు విజయసాయిరెడ్డి, డాక్టర్ సత్యవతి, దేవదాయ శాఖ కమిషనర్ సలహా కమిటీలో చేరుస్తూ దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజాశంకర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

దశాబ్దాలుగా మగ్గుతున్న సింహాచలం పంచ గ్రామాల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ సహా జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి సభ్యులుగా సింహాచలం ఈవో సభ్య కన్వీనర్​గా ఉన్నారు. ఇప్పుడు తాజాగా సలహా కమిటీలో అదనంగా ఎంపీలు, దేవాదాయ శాఖ కమిషనర్​ను చేర్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.