విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ సామాజిక కార్యకర్త సురేశ్ పాదయాత్ర చేపట్టారు. ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన గుంటూరులోని అమృతరావు విగ్రహం నుంచి సాగరనగరంలోని ఉక్కు కర్మాగారం వరకు 400 కిలోమీటర్ల మేర తలపెట్టిన పాదయాత్రను.. మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ ప్రారంభించారు.
విశాఖ ఉక్కును రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని శివాజీ పిలుపునిచ్చారు. పరిశ్రమ ప్రైవేటీకరణతో అందరికీ నష్టమేనని.. కార్మికులు రోడ్డున పడతారని, రాబోయే తరాలకు ఉద్యోగాలు లేకుండా పోతాయని సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ, ప్రజా సంఘాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు.
ఇదీ చదవండి: