విశాఖ జిల్లా పాడేరు ప్రభుత్వ పాఠశాలలో 1990 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వపు విద్యార్థులు అదే పాఠశాలలో సమావేశమయ్యారు. ప్రస్తుతం అందరూ వివిధ వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడి ఉండడంతో ఒకరినొకరు పోల్చుకోవడంలో కూడా కాస్త ఇబ్బందిపడ్డారు. ఆనాటి ఇంటి పేర్లతో పిలుచుకుని ఒక్కసారి కేరింతలు కొట్టారు.
వీరిలో కొందరు వ్యాపారులు, కొందరు ఉపాధ్యాయులు, మరికొందరు రెవెన్యూ సిబ్బందిగా ఉద్యోగాలు చేస్తున్నారు. చిన్ననాటి చిలిపి చేష్టలు.. సాంస్కృతిక కార్యక్రమాలు వంటి విషయాలను ఒకసారి గుర్తు చేసుకుని ఆనందించారు. ప్రస్తుతం వారు చేస్తున్న పనులు, వారి పిల్లల చదువులు, ఎక్కడ నివసిస్తున్నది వంటి వ్యక్తిగత విషయాలు పరస్పరం పంచుకున్నారు. 30 ఏళ్ల తర్వాత అందరూ తిరిగి కలవడంతో.. వారిలో ఆనందానికి అవధులు లేకుండాపోయింది.
ఇదీ చదవండి: ఎద్దు ఆటోలు.. కార్లు.. భలే భలే!