విశాఖ జిల్లా పాడేరు బాలుర ఆశ్రమ పాఠశాలలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. అంబేడ్కర్ స్ఫూర్తిని అలవర్చుకోవాలని చెప్పారు. గిరిజనులు రిజర్వేషన్లు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తు తరాలకు మార్గదర్శకం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి బాలాజీ, విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి