పొట్టకూటి కోసం వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒరిస్సా వలసకూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చోడవరం తహసీల్దారు కార్యాలయంలో 536 మంది ఇటుక బట్టి కార్మికులకు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
ఇవీ చదవండి: ప్రపంచంపై కరోనా పంజా.. 25 లక్షలకు చేరువలో కేసులు