విశాఖ జిల్లాలో బంగాళాఖాతం తీరం వెంబడి సముద్రపు అలల తాకిడి బాగా పెరిగింది. పారాదీప్ సమీపంలో తీరాన్ని తాకిన తుపాను ప్రభావం సముద్ర జలాల్లో కనిపించింది. పూడిమడక, యారాడ గంగవరం ప్రాంతాల్లో సముద్రం బాగా ముందుకు వచ్చింది. విశాఖ నగరంలోని ఆర్కే బీచ్లో సముద్రపు అలల ఉద్ధృతి పెరిగింది.
తుపాను తీరం దాటే సమయంలో నగరంలో, జిల్లావ్యాప్తంగా బాగా ఎండ పెరిగింది. రోజు కంటే వేడిమి తీవ్రత కూడా బాగా పెరిగింది. ఇదంతా వాతావరణంలో వచ్చిన మార్పులకు అనుగుణంగానే ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇదీ చదవండి: