ETV Bharat / state

విశాఖలో రూ.25 ఉల్లి కోసం జనం బారులు - ONION rates updates

విశాఖపట్నం రైతుబజార్లో ఉల్లిపాయల కోసం స్థానికులు బారులుతీరారు. కిలో ఉల్లిని రూ.25కే అధికారులు అందిస్తున్నారు. బయటి మార్కెట్లో ఉల్లి ధర ఎక్కువగా ఉండటంతో రైతుబజార్లో డిమాండ్ బాగా ఉందని చెబుతున్నారు.

onion-rates
author img

By

Published : Sep 27, 2019, 12:42 PM IST

ఉల్లి ధర కిలో రూ.25- బారులు తీరిన జనం

ఉల్లి ధరలు కొండెక్కడంతో... రైతు బజార్లో అమ్ముతున్న ఉల్లిపాయల కోసం ప్రజలు బారులుతీరుతున్నారు. విశాఖలోని రైతు బజార్లలో... కిలో ఉల్లిని 25 రూపాయలకు అందిస్తున్నారు. 15 టన్నుల ఉల్లిని రాయితీ ధరపై ఇస్తున్నారు. డిమాండ్‌ ఎక్కువగా ఉండటం వల్ల... రేపటి నుంచి 20 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నిస్తామని అధికారులు తెలిపారు.

Intro:Ap_cdp_46_27_etv bharat_paryavarana ryali_Av_Ap10043
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వల్ల పర్యావరణాన్ని కాపాడవచ్చునని విద్యార్థులు నినదించారు. ప్లాస్టిక్ సంచులు వద్దు గుడ్డ సంచులు ముద్దు అంటూ కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఈటీవీ భారత్- నేషనల్ గ్రీన్ కోర్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఉన్నత పాఠశాల నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారంగా ఏర్పడి ప్లాస్టిక్ వినియోగం తగ్గిస్తానని నేను, నేను నా ఇంటిని నా పరిసర ప్రాంతాలలో పాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలిస్తానని, పర్యావరణాన్ని కాపాడుతానని, ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను పదిమందికి వివరిస్తానని విద్యార్థుల చేత గ్రీన్ కోర్ కమిటీ అధికారి చక్రధర్ రాజు ప్రతిజ్ఞ చేయించారు.

Body:ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నియంత్రణపై విద్యార్థులతో అవగాహన ర్యాలీ

Conclusion:అరవింద్ విద్యార్థి ప్రభుత్వ ఉన్నత పాఠశాల
గ్రీన్ కోర్ కమిటీ అధికారి చక్రధర్ రాజు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.