ఉల్లి ధర వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. వారం రోజుల్లోనే 10 రూపాయల మేర ధర పెరగటంతో విశాఖలో వినియోగదారులు సతమతమవుతున్నారు. బయటి మార్కెట్‌తో పాటు రైతుబజార్‌లోనూ కిలో ఉల్లి 35 నుంచి 40 రూపాయల మేర అమ్ముతున్నారు. ధరల పెరుగుదలతో కిలో కొనాల్సిన చోట అరకిలోతోనే సరిపెడుతున్నామంటున్నారు ప్రజలు.
కొద్దిరోజుల క్రితం వరకు రాష్ట్రంలో వర్షాల కారణంగా... గ్రామల నుంచి సరకు రవాణా తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్ర నుంచి ఉల్లి తెప్పిస్తున్నామని వివరించారు. సరకు ధరతోపాటు రవాణా ఛార్జీలు తోడవటం వల్ల ధరలు పెరిగాయంటున్నారు. ఉల్లి ధర పెరగటంతో... హోటల్స్, రెస్టారెంట్లలోనూ ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశాలున్నాయని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు.