విశాఖ జిల్లా దేవరాపల్లి - పినకోట రోడ్డులో దిబ్బలపాలెం వద్ద.. ఓ ఆటో అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. దిబ్బలపాలెం గ్రామస్థులు దేవరాపల్లి నుంచి ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఘటన జరిగింది. తొమ్మిది మంది ప్రయాణిస్తున్న ఆటో.. అదుపుతప్ప లోయలోకి దూసుకెళ్లింది. ఘటనలో.. అనంతగిరి మండలం బీళ్లకంభ గ్రామానికి చెందిన సోమల బుచ్చయ్య మృతిచెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వారందరిని దేవరాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి: