విశాఖ జిల్లా నర్సీపట్నం రూరల్ ఓఎల్ పురం గ్రామ వీఆర్ఓ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాతవరం మండలంలోని వీఆర్ఓగా పనిచేస్తున్న చల్లా రమణ.. తన ఇంటికి ఎదురుగా ఉండే పురాతన గ్రామ దేవత భూలోక తల్లి ఆలయాన్ని.. పున:నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇటీవల గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన నాగేశ్వరరావు, వార్డు మెంబరు రమణ, అప్పారావులు ఆలయ స్థల విషయమై.. ఆలయ నిర్మాణ విషయంలో జోక్యం చేసుకోవద్దని వీఆర్వోను గట్టిగా హెచ్చరించినట్లు స్థానికులు వాపోతున్నారు. మనస్థాపంతో వీఆర్వో రమణ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు మృతుని భార్య వెంకట రాజ్యలక్ష్మి.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావుతో పాటు ప్రస్తుత వార్డు సభ్యులు రమణ, మాజీ వార్డు సభ్యులు అప్పారావులపై నర్సీపట్నం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వీఆర్వో ఆత్మహత్యకు తాము కారణం కాదని కుటుంబ విషయాలు కారణమై ఉంటాయని సర్పంచ్ నాగేశ్వరరావు పేర్కొంటున్నారు.
ఇవీ చూడండి...