ETV Bharat / state

corona at schools: 19 మంది విద్యార్థులకు కొవిడ్​.. పాఠశాలకు వారం రోజులు సెలవు - విశాఖ పాడేరు ఏజెన్సీ గిరిజన గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

covid cases at gurukul school in visakha
విశాఖ ఏజెన్సీలో కరోనా కలకలం
author img

By

Published : Sep 24, 2021, 8:44 AM IST

Updated : Sep 24, 2021, 9:23 AM IST

08:41 September 24

జి.మాడుగుల బాలుర ఆశ్రమ పాఠశాలలో 19 మంది విద్యార్థులకు కరోనా

విశాఖ పాడేరు ఏజెన్సీ జి.మాడుగులలోని గిరిజన గురుకుల(ఆశ్రమ) బాలురు పాఠశాలకు వారం రోజులు సెలవులను(covid holidays for ashrama school in paderu agency) అధికారులు ప్రకటించారు. ఆశ్రమ పాఠశాలలో కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 19 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు(19 students effected by covid in gurukul school) తెలింది.  దీంతో అప్రమత్తమైన అధికారులు.. ఇతర విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పాఠశాలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు.

గురుకుల పాఠశాలల్లో కరోనా కలకలం..

పాడేరు ఏజెన్సీలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో (covid in gurukul schools) కరోనా కలకలం రేపుతోంది. జి.మాడుగుల కొత్తూరు గిరిజన సంక్షేమ ఆశ్రమ(గురుకుల) పాఠశాలలో 19 మంది విద్యార్థులకు కరోనా సోకింది. చింతపల్లి బాలుర సంక్షేమ గురుకుల గిరిజన పాఠశాలలో మరో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. వీరిని పాడేరు కొవిడ్​ ఆస్పత్రికి తరలించారు. జి.మాడుగులలో మొత్తం 140 మంది విద్యార్థులకు 20వ తేదీన కరోనా పరీక్షలు నిర్వహించగా ఈరోజు వచ్చిన ఫలితాల్లో 19 మంది పాజిటీవ్​ ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. ముందస్తుగా మరో యాభై మందికి ఈరోజు కరోనా పరీక్షలు నిర్వహించారు. లక్షణాలు ఉన్న విద్యార్థులను మరో గది​లో ఉంచారు. అనంతరం పాడేరు ఆస్పత్రికి(covid cases at residential schools in paderu) తరలించారు. ఇటీవలే పాఠశాలకు వచ్చిన మిగిలిన విద్యార్థులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏ ఒక్కరికి కరోనా ఉన్నా అందరికి ప్రబలే అవకాశం ఉన్నందున మిగిలిన వారు భయభ్రాంతులకు గురవుతున్నారు.

 సంబంధింత కథనం..

Corona: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని 21మంది విద్యార్థులకు కరోనా..

రాష్ట్రంలో కొత్తగా 1,171 కరోనా కేసులు, 11 మరణాలు

Last Updated : Sep 24, 2021, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.