విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక పరిధితో పాటు పరిసర ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతున్న కారణంగా.. అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందుకు సంబంధించి నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారిణి లక్ష్మీ శివజ్యోతితో పాటు మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, నర్సీపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామి నాయుడు తదితరులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
దుకాణాల సముదాయాలకు సంబంధించి సమయాలను వివరించారు. వ్యాపారులంతా సహకరించాలని అధికారులు కోరారు. కరోనా పాజిటివ్ కేసులు అదుపులోకి వచ్చే వరకు వ్యాపారులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు వ్యాపారులు అంగీకరించారు.
ఇవీ చూడండి: