విశాఖ జిల్లా అప్పుఘర్ మత్స్యకార గ్రామంలో ఈ నెల 12న ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకింది. చుట్టు పక్కల వారికి పరీక్షలు నిర్వహించగా మరో 13 మందికి పాజిటివ్ అని నిర్ధరణ అయ్యింది. వీరిలో ఒక వాలంటీరు, జీవీఎంసీ ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీలో ఉన్న ఓ అభ్యర్థిని, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో.. బుధవారం 75 మందికి పరీక్షలు చేశారు. గురువారం మరో 200 మందికి పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. కేసులు పెరుగుతున్న కారణంగా... కంటైన్మెంట్ పరిధిని 500 మీటర్లకు పెంచారు.
ఒకే గ్రామంలో మొత్తంగా.. 16 కేసులు నమోదు కావడంపై అధికారులు విస్తృతంగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. టీ విక్రేతకు, అతని భార్యకు కరోనా రాగా.. వారు ఎవరెవరిని కలిశారన్నది గుర్తిస్తున్నారు. వారు రైతు బజారు, కేజీహెచ్, ఆళ్వార్ దాస్ మైదానం తదితర ప్రాంతాల్లో టీ విక్రయించినట్టు తెలుసుకున్నారు. అదే ప్రాంతంలో ఓ శుభ కార్యానికి హాజరైన 14 మందికి కరోనా వచ్చినట్టు చెప్పారు. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు, అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: