ETV Bharat / state

విశాఖలోని దుకాణ గుత్తేదారులకు నోటీసులు

విశాఖ మహా నగరపాలక సంస్ధ పరిధిలోని 187 దుకాణాలలో.. బినామీలు ఉన్నట్లు గుర్తించామని మున్సిపల్ కమిషనర్ సృజన తెలిపారు. బినామీల ఆధీనంలో ఉన్న దుకాణాలను.. వాస్తవ గుత్తేదారులకు నోటీసులు జారీ చేశామన్నారు. గడువు ముగిసే లోపల దుకాణాలు ఖాళీ చేయనట్లయితే.. వాటిని స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.

Notices have been issued to the shops owned by Binami's at vishaka
బినామీల ఆధీనంలో ఉన్న దుకాణాల వాస్తవ గుత్తేదారులకు నోటీసులు
author img

By

Published : Jul 9, 2021, 9:33 PM IST

విశాఖ మహా నగరపాలక సంస్ధ పరిధిలోని 187 దుకాణాలలో.. బినామీలు ఉన్నట్లు గుర్తించామని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ సృజన వెల్లడించారు. జీవీఎంసీ ఆదాయం పెంపొందించేందుకు, ఆదాయ లోపాలను సరిదిద్దేందుకు ప్రణాళిక అమలు చేయనున్నట్టు ప్రకటించారు. బినామీల ఆధీనంలో ఉన్న దుకాణాలను.. వాస్తవ గుత్తేదారులకు నోటీసులు జారీ చేశామన్నారు. గడువు ముగిసే లోపల దుకాణాలు ఖాళీ చేయనట్లయితే.. వాటిని స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. గుత్తేదారుడు అప్పటివరకు చెల్లించవలసిన అద్దె మొత్తం.. దుకాణంలో ఉన్న పరికరాలు, సామగ్రి వేలం వేసి బకాయిల కింద దానిని జమ చేస్తామన్నారు. లీజు పునరుద్ధరణ చేయకుండా అనధికారికంగా ఉన్న 389 దుకాణాలను గుర్తించామని.. వీరంతా అక్రమంగా ఉన్నట్టుగానే పరిగణిస్తామని వివరించారు. 3 సంవత్సరాలు లీజు దాటిన దుకాణాలకు.. మళ్లీ వేలం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అద్దె చెల్లించని లీజుదారుల నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్​ను ఉపయోగించి.. అద్దె వసూలు చేస్తామని కమిషనర్ సృజన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

CM JAGAN : 'ప్రముఖ నగరాల సరసన త్వరలో కడప చేరుతుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.