విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లోని పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరిగింది. నియోజకవర్గ పరిధిలో 111 పంచాయతీలు, 1066 వార్డు స్థానాలు ఉన్నాయి. వాటిలో తొలి రోజు సర్పంచ్ స్థానానికి 48, వార్డు సభ్యుల స్థానానికి 94 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ రేపటి వరకూ కొనసాగనుంది.
ఇదీ చదవండి: