విశాఖ జిల్లా అనకాపల్లికి జీవనోపాధి కొరకు తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారు 40 మంది సంచార జీవులు వచ్చారు. జనతా కర్ఫ్యూ పాటించిన రెండు రోజుల ముందు వీరు అనకాపల్లి వచ్చారు. మండలంలోని సత్యనారాయణపురంలోని మామిడితోటలో గుడారాలు వేసుకొని ఉంటున్నారు. జనతా కర్ఫ్యూ మరుసటి రోజు నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయడంతో వీరిక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి పనులు లేక ఇబ్బందులు పడుతున్న వీరికి స్థానికంగా ఉన్న పలువురు దాతలు సాయం అందించారు. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా బియ్యంతో పాటు రూ. 1500 నగదు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే దీన్ని అందుకోవడానికి తాము అక్కడ లేమని ఈ నగదును తమకు అందించేలా ఇక్కడి ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
లాక్డౌన్తో ఇబ్బందులకు గురవుతున్న సంచార జీవులు - విశాఖ జిల్లా అనకాపల్లి లో లాక్డౌన్ తో సంచార జీవుల ఇబ్బందులు
కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న లాక్డౌన్తో సంచార జీవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి జీవనోపాధి కోసం విశాఖ జిల్లా అనకాపల్లి వచ్చిన పలువురు లాక్డౌన్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్న వీరిని స్థానికులు ఆదుకోని నిత్యావసర సరకులు అందించారు.
విశాఖ జిల్లా అనకాపల్లికి జీవనోపాధి కొరకు తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారు 40 మంది సంచార జీవులు వచ్చారు. జనతా కర్ఫ్యూ పాటించిన రెండు రోజుల ముందు వీరు అనకాపల్లి వచ్చారు. మండలంలోని సత్యనారాయణపురంలోని మామిడితోటలో గుడారాలు వేసుకొని ఉంటున్నారు. జనతా కర్ఫ్యూ మరుసటి రోజు నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయడంతో వీరిక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి పనులు లేక ఇబ్బందులు పడుతున్న వీరికి స్థానికంగా ఉన్న పలువురు దాతలు సాయం అందించారు. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా బియ్యంతో పాటు రూ. 1500 నగదు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే దీన్ని అందుకోవడానికి తాము అక్కడ లేమని ఈ నగదును తమకు అందించేలా ఇక్కడి ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఇదీ చూడండి:ఓ బాటసారి.. అందుకో మా సాయం