ETV Bharat / state

గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందని పౌష్టికాహారం - విశాఖ జిల్లా బాలయోగి గురుకుల పాఠశాల తాజా వార్తలు

విశాఖ జిల్లా గొలుగొండలోని బాలయోగి గురుకుల పాఠశాలలో.. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పాఠశాలపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

no proper food is kept for students in balayogi gurukula school at vishakapatnam
బాలయోగి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందని పౌష్టికాహారం
author img

By

Published : Feb 22, 2021, 3:23 PM IST

విశాఖ జిల్లా గొలుగొండలోని బాలయోగి గురుకుల పాఠశాలలో.. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా పూర్తిస్థాయిలో ఉండటం లేదని ఆరోపించారు. ఇతరులకు ఇన్​ఛార్జి బాధ్యతలు అప్పగించడంతో నిర్వహణ సక్రమంగా లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

గురుకుల పాఠశాలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 640 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి మెరుగైన విద్యను అందించడంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాల్సిన ఉంది. ఇందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం మెనూ నిర్దేశించి విద్యాలయాలకు జారీచేసినా.. ఆహారం సరిగ్గా లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఆదివారం మెనూ అమలుకు సంబంధించి.. అన్నంతో పాటు చికెన్ కర్రీ , గోంగూర చెట్నీ , సాంబారు, పెరుగు అందించాల్సి ఉంది. ఆ మెనూ ప్రకారం భోజనం అందించకుండా ఉడికి ఉడకని చికెన్​తో పాటు సాంబారును మాత్రమే అందించారని విద్యార్థులు తెలిపారు.

విద్యాలయాన్ని ఉన్నతాధికారులు పరిశీలించి మెరుగైన విద్య, భోజనాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: పార్కుల్లో మునుపటి సందడి... పెరుగుతున్న సందర్శకుల తాకిడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.