ETV Bharat / state

‘ములాఖత్‌’లకు మోక్షమెప్పుడో! - జైళ్ల ములాఖత్ న్యూస్

కరోనా వ్యాప్తి, లాక్​డౌన్ నిబంధనలతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారాగారాల్లో ములాఖత్​లు నిలిపివేశారు. ఏడెనిమిది నెలలుగా కుటుంబ సభ్యులను కలిసేందుకు వీలు లేకపోవటంతో ఖైదులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు.

no mulakhat to prisoners
ఆగిన ములాఖత్​
author img

By

Published : Nov 5, 2020, 11:12 AM IST

కొవిడ్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారాగారాల్లోని ఖైదీలు గత ఏడెనిమిది నెలలుగా తమ కుటుంబసభ్యులను కలుసుకునే అవకాశం లేకుండా పోయింది. లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను వివిధ సంస్థలకు క్రమంగా సడలిస్తున్నా అవి జైళ్ల వరకూ రాలేదు. రాష్ట్రంలో కేంద్ర, జిల్లా, మహిళా, ఉప, ప్రత్యేక కారాగారాల్లో దాదాపు ఆరు వేల మంది వరకు ఖైదీలు ఉన్నట్లు అంచనా. శిక్ష పడిన ఖైదీలకు ప్రతి 14 రోజులకు, రిమాండ్‌ ఖైదీలకు వారానికి రెండుసార్లు ‘ములాఖత్‌’కు అవకాశం కల్పిస్తారు. ఏప్రిల్‌ నుంచి ఇది నిలిచిపోవడంతో పలువురు ఖైదీలు మానసికంగా కుంగిపోతున్నారు. మరో పక్క చాలామంది ఖైదీల పి.పి.సి.(ప్రిజనర్స్‌ ప్రైవేట్‌ క్యాష్‌) మొత్తాలు కూడా ఖాళీ అయ్యాయి. జైళ్లకు కూడా మార్గదర్శకాలు సడలించి ‘ములాఖత్‌’లకు అవకాశం కల్పిస్తారని వారు ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి:

మిస్టరీగా ఉక్కు - పోస్కో ఒప్పందం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.