ETV Bharat / state

దర్శనీయ ప్రాంతాల్లో కొరవడిన వసతి సదుపాయాలు - Tourist Places In AP

రాష్ట్రంలోని దర్శనీయ ప్రాంతాల్లో కనీస సదుపాయాలు కరవై పర్యాటకులు అవస్థలు పడుతున్నారు. ఈ కొరత తీర్చేందుకు రూ.70 కోట్లకు పైగా అంచనా వ్యయంతో నాలుగేళ్ల కిందట ప్రారంభించిన 25 ప్రాజెక్టుల పనులు నిధుల కొరతతో అసంపూర్తిగా నిలిచిపోయాయి.

దర్శనీయ ప్రాంతాల్లో కొరవడిన వసతి సదుపాయాలు

author img

By

Published : Mar 22, 2021, 5:13 AM IST

విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయగోదావరి, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, కడపలోని ముఖ్యమైన సందర్శనీయ ప్రాంతాలను గుర్తించి రిసార్ట్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి భవనాల నిర్మాణం ప్రారంభించారు. బిల్లులు సరిగా చెల్లించడం లేదని గుత్తేదారు సంస్థలు సగంలోనే పనులు నిలిపివేశాయి. పాత బిల్లులు చెల్లించేందుకు ప్రస్తుతం రూ.35 కోట్లకు పైగా కావాలి. శ్రీకాకుళం జిల్లా జగతిపల్లిలో రిసార్ట్‌ పనులు ప్రాథమిక దశలోనే నిలిచిపోయాయి. కర్నూలు జిల్లా అహోబిలంలో భక్తులకు అదనపు వసతి కల్పించేందుకు ప్రారంభించిన భవన నిర్మాణ పనులు పూర్తి కాలేదు.

పర్యాటక సంబంధిత అత్యవసర పనుల కోసం జిల్లాకు ఏటా రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లు ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయిస్తోంది. కలెక్టర్‌ ఛైర్మన్‌గా ఉండే జిల్లా పర్యాటక మండలి ఈ నిధులతో సదుపాయాలు కల్పిస్తుంది. ఇలా జిల్లా కలెక్టర్లు కేటాయించిన పనులకూ మరో రూ.35 కోట్లకుపైగా బకాయిలు చెల్లించాలి. ఈ కారణంగా కొత్త పనులు చేపట్టేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పనులైతే పూర్తయినా బిల్లులు చెల్లించేందుకు నిధుల్లేవు. కొద్దికాలంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో పర్యాటక రంగానికి కొత్త పనులు మంజూరు చేయడం లేదు. కొన్ని జిల్లాలో మంజూరు చేసినవీ సాగడం లేదు.

అనుమతి సరే.. రుణమేది..?

అసంపూర్తిగా నిలిచిపోయిన ముఖ్యమైన ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడం, హోటళ్లు, రిసార్ట్‌ల ఆధునికీకరణ కోసం ఆర్థిక సంస్థల నుంచి రూ.142 కోట్ల రుణం తీసుకోడానికి ఏపీటీడీసీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకోసం గత డిసెంబరు 9న ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీటీడీసీ ఆస్తులను హామీగా పెట్టి రుణం తీసుకోడానికి అనుమతులైతే ఇచ్చినా ఇప్పటికీ అప్పు పుట్టలేదు. ఒక జాతీయ బ్యాంకును సంప్రదిస్తే ఏపీటీడీసీ ఆడిట్‌ పూర్తి చేయించి సర్టిఫికెట్‌ సమర్పించాలని సూచించింది. ఏపీటీడీసీ ప్రస్తుతం ఆ పనిలో ఉంది.

* ప్రసిద్ధ శైవక్షేత్రం ప్రకాశం జిల్లాలోని భైరవకోనను వారాంతంలో వేలాది మంది సందర్శిస్తుంటారు. పర్యాటకంగానూ ఎంతో ప్రాధాన్యం కలిగిన భైరవకోనలో తగిన సదుపాయాలు కల్పించేందుకు ఏపీటీడీసీ రూ.2 కోట్లతో ప్రారంభించిన రిసార్ట్‌, రెస్టారెంట్‌ పనులు నిధుల కొరతతో అసంపూర్తిగా నిలిచిపోయాయి. వీటిని పూర్తి చేస్తే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

ఇదీ చదవండీ... కొవిడ్ కేర్ సెంటర్లలో ఆకలి కేకలు.. పౌష్టికాహారం పక్కదారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.