కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయిలో ఆయా అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ విధించిన తరుణంలో.. ఇందుకుగాను ఎవరినీ ఉపేక్షించకుండా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ అవసరమైతే కేసులు నమోదు చేస్తున్నారు.
విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. డివిజన్లోని రోలుగుంట, రావికమతం, మాకవరపాలెం, నాతవరం, గొలుగొండ, కొయ్యూరు తదితర మండలాలకు నర్సీపట్నం ప్రధాన వ్యాపార కూడలి కావడంతో నిత్యం వ్యాపార లావాదేవీలు కొనసాగుతుంటాయి. ఈ క్రమంలో ప్రభుత్వ జారీ చేసిన మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయడంలో భాగంగా.. జనసంచారం జరగకుండా పోలీసులు రాత్రి కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు. పట్టణానికి నలుదిక్కుల పహారా కాస్తూ.. పట్టణంలోకి వచ్చి వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ వాహనదారుల చిరునామాలు, సెల్ ఫోన్ నెంబర్లను నమోదు చేస్తున్నారు. రాత్రి పది గంటల తర్వాత అనవసరంగా సంచరించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి