ETV Bharat / state

ఎల్జీ పాలిమర్స్ ఘటన.. మానవహక్కుల ఉల్లంఘన : ఎన్​హెచ్ఆర్సీ - కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల డైరెక్టర్‌ జనరల్‌

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటన తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందని జాతీయ మానవ హక్కుల సంఘం స్పష్టం చేసింది. బాధితుల జీవించే హక్కును ఆ ఘటన హరించివేసిందని అభిప్రాయపడింది.

ఎల్జీ పాలిమర్స్ ఘటన.. మానవహక్కుల ఉల్లంఘన : ఎన్​హెచ్ఆర్సీ

author img

By

Published : Feb 20, 2021, 4:48 AM IST

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటన తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందని జాతీయ మానవ హక్కుల సంఘం స్పష్టం చేసింది. బాధితుల జీవించే హక్కును ఆ ఘటన హరించి వేసిందని అభిప్రాయపడింది. ఈ ఘటనకు మానవ తప్పిదం, నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రాథమిక నివేదికలు లేకపోయినా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, వేల మంది అనారోగ్యం పాలయ్యారని తెలిపింది.

ప్రజల పాలిట పిడుగు..

కరోనా కారణంగా ఇళ్లలోనే ఉంటున్న సమయంలో చోటుచేసుకున్న ఈ భయంకరమైన విషాదం ప్రజల పాలిట ఆకాశం నుంచి ఊడిపడిన పిడుగులా మారిందని ఎన్​హెచ్ఆర్సీ వ్యాఖ్యానించింది.

ఇకపై జోక్యం అవసరం లేదు..

రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల డైరెక్టర్‌ జనరల్‌ నుంచి నివేదికలు తెప్పించుకుని పరిశీలించిన జాతీయ మానవ హక్కుల సంఘం ఇక మీదట ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఆ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

దానికి ఆమోదముద్ర వేశాం : ఎన్​హెచ్ఆర్సీ

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందించడం, బాధితులకు సాయం చేయడం, ప్రమాదానికి కారణమైన 12 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికన పరిగణలోకి తీసుకుని ఆమోదముద్ర వేసినట్లు ఎన్​హెచ్ఆర్సీ వెల్లడించింది.

ఇదీ చదవండి

'ఫాం-10 ఇచ్చిన స్థానాల్లో.. ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ విచారణ జరపవద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.