విశాఖలో ప్రజలు నిత్యావసర వస్తువులకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అధికారులు అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో ఇప్పటికే 13 రైతుబజార్లు ఉండగా తాజాగా మరో 18 రైతు బజార్లను అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా ప్రజలకు తమ పరిసర ప్రాంతాల్లోనే నిత్యావసర వస్తువులు లభిస్తున్నాయి. వీటికోసం విశాఖ జ్ఞానపురంలోని హోల్సేల్ మార్కెట్ ప్రత్యేకంగా పనిచేస్తోంది.
ఇక జిల్లా ఉద్యానవన శాఖ అటు రైతులకు ఇటు ప్రజలకు మేలు చేసేందుకు ఐదు కిలోల పళ్లు, కూరగాయల సంచులను రూ.100కి అందిస్తోంది. రైతు బజార్ల నుంచి కూరగాయలను ఆన్లైన్లో కొనుగోలు చేసేలా జొమాటో సంస్థతో కలిసి పని చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్ శివశంకర్ నేతృత్వంలో ఈ చర్యలు అమలవుతున్నాయి.
ఇదీ చూడండి: