శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం రిట్టపాడు గ్రామానికి చెందిన ఐలా చంద్రమ్మ.. గిరిజన హక్కుల కోసం విరోచితంగా పోారాడారు. సాయుధ పోరాట్లలో చురుగ్గా పని చేసేవారు. 1968లో సీపీఐ అనుబంధ మహిళా సంఘంలో ప్రవేశించి.. గరుడ భద్ర భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.
నక్సల్బరీ పోరాట స్ఫూర్తితో దళ నాయకుడైన పైలా వాసుదేవరావుని ఆమె వివాహం చేసుకున్నారు. మందస సమీపంలోని జరిగిన ఎన్కౌంటర్లో ఆయన తప్పించుకోగా గాయపడిన చంద్రమ్మ పోలీసులకు పట్టుబడ్డారు. అనంతరం పోరాటాలకు దూరంగా ఉంటున్న భర్త పదేళ్ల కిత్రం అనారోగ్యంతో మృతి చెందగా.... గత కొద్దిరోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ.... ఆమె తుదిశ్వాస విడిచారు.
ఇదీ చూడండి: ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి