విశాఖ జిల్లా నాతవరం మండలం తాండవ జలాశయం నిత్యం నీటితో కళకళలాడే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. ఇందుకోసం అవసరమైన నిధులు కేటాయించాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. దీనికిగాను తాత్కాలికంగా రూ.500 కోట్లు అవసరమని ప్రభుత్వానికి సూచించారు.
విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఈ వినతిపత్రం అందజేశారు. తాండవ జలాశయం కింద... విశాఖ జిల్లాతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని సుమారు 52 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. విశాఖ జిల్లాకు సంబంధించి నాతవరం మండలంతో పాటు నర్సీపట్నం, పాయకరావుపేట మండలాల్లో సుమారు 32 వేల 689 ఎకరాలు... తూర్పుగోదావరి జిల్లాలో 18 వేల 776 ఎకరాలు చొప్పున ఖరీఫ్‌లో సమృద్ధిగా నీరు అందుతుందని తద్వారా వరిపంట రైతుల దక్కించుకుంటారని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాండవ జలాశయంలో నిత్యం నీరు సమృద్ధిగా ఉండేందుకు... ఏలేరు కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు తీసుకురావడానికి సుమారు రూ.250 కోట్లు, తాండవ కాలువల అభివృద్ధికి మరో 250 కోట్లు అవసరమని అంచనా వేశారు.
ఇదీ చదవండి: